Cm Revanth Singapore Tour : సింగపూర్ లో సీఎం రేవంత్ టీమ్ పెట్టుబడుల వేట.. రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ఎస్టీ టెలీ మీడియా

ముఖ్యమంత్రి సమక్షంలో పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు.

Cm Revanth Singapore Tour : సింగపూర్ లో సీఎం రేవంత్ టీమ్ పెట్టుబడుల వేట.. రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ఎస్టీ టెలీ మీడియా

Updated On : January 19, 2025 / 12:09 AM IST

Cm Revanth Singapore Tour : సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల వేటలో బిజీబిజీగా గడిపింది. రెండో రోజు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్టీ టెలీ మీడియా 3వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ముచ్చర్ల సమీపంలోని మీర్ ఖాన్ పేట్ లో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ని స్థాపించనుంది.

ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో వారు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ ఒప్పందంపై సంతకాలు చేశారు.

100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్ ను ఈ కంపెనీ నెలకొల్పనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్స్ సామర్ధ్యాన్ని పెంచుకునే సదుపాయం ఉంటుంది. దేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్లలో ఇదొకటిగా నిలుస్తుంది.

Also Read : బిల్లుల కోసం తెలంగాణ మంత్రుల పంచాయితీ.. ఢిల్లీ పెద్దలకు మొర..!

త్వరలోనే డేటా సెంటర్లకు హైదరాబాద్ రాజధానిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులు అభినందించారు. తెలంగాణతో కలిసి పని చేయడం గౌరవంగా ఉందని మీడియా గ్లోబల్ డేటా సెంటర్ సీఈవో బ్రూనో లోపెజ్ అన్నారు. ప్రపంచానికే డేటా హబ్ గా హైదరాబాద్ మారుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కంపెనీ హైటెక్ సిటీలో డేటా సెంటర్ ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంప్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది.

 

Also Read : బిల్లుల కోసం తెలంగాణ మంత్రుల పంచాయితీ.. ఢిల్లీ పెద్దలకు మొర..!