Cold Winds
Cold Winds : తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తూర్పు ఈశాన్య దిశల నుంచి రాష్ట్రంలోకి శీతల గాలులు వీస్తున్నాయని…. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశంఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read : Odisha Journalist : బాంబు పేలి జర్నలిస్టు మృతి
కాగా, రాష్ట్రంలో నిన్న అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. మెదక్‌లో 11.5 డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగ్రీలు, హన్మకొండలో 12.5 డిగ్రీలు, దుండిగల్‌లో 13.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 13 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.7 డిగ్రీలు, హకీంపేట్‌లో 14.7 డిగ్రీలు, భద్రాచలంలో 15.2 డిగ్రీలు, ఖమ్మంలో 15.4 డిగ్రీలు, నల్లగొండలో 16 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వివరించారు.