Telangana
Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం కొమరిన్ ప్రదేశం దాని ప్రక్కనే ఉన్న ఉత్తర శ్రీలంక తీరం దగ్గర కొనసాగుతుంది. ఇక ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇది రాగల 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి వెళ్లి బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చదవండి : Rains In Andhra Pradesh : అల్పపీడన ప్రభావంతో ఏపీలో 2రోజులు వర్షాలు
ఉపరితల ద్రోణి కొమరిన్ ప్రదేశం దాని ప్రక్కనే ఉన్న ఉత్తర శ్రీలంక తీరం నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు తీరం మీదగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలో ఓ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమ, మంగళ వారాల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.
చదవండి : Rains In Ap : ఏపీలో నేడు, రేపు వర్షాలు
మరోవైపు ఈ అల్పపీడనం ప్రభావంతో అనంతపురం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కదిరి, పుట్టపర్తి , పెనుకొండ, మడకశిర, ధర్మవరం నియోజకవర్గాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 63 మండలాలు ఉండగా, 30 మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.