Rains In Ap : ఏపీలో నేడు, రేపు వర్షాలు

నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని అనేక చోట్ల వర్షాలు కురిసాయి.

Rains In Ap : ఏపీలో నేడు, రేపు వర్షాలు

Rains In Ap

Rains In Ap : నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని అనేక చోట్ల వర్షాలు కురిసాయి. ఎర్రగొండపాలెం, ఉదయగిరి, కనిగిరి, తిరుపతి ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది.

చదవండి : Heavy Rains in Kerala: కేరళలో జల ప్రళయం

ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి.. ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

చదవండి : Kerala Rains : ఇడుక్కి డ్యామ్ లోకి భారీగా వరదనీరు..24గంటల్లోనే 4అడుగులకు పైగా