Betting Apps: బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పై ఫిర్యాదు

బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారంటూ టాలీవుడ్ హీరోలు ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Betting apps case

Betting Apps Case: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ యువత పెడదోవ పట్టడానికి కారణమవుతున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు సినీ, బుల్లితెర నటీనటులపై, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలపై ఈ కేసులు నమోదుకాగా.. తాజాగా. టాలీవుడ్ అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లపైనా పోలీసులకు ఫిర్యాదు అందింది.

Also Read: విద్యార్థిని తండ్రి నిర్ణయం.. అధికారులను కదిలించింది.. మూతపడే బడిని బతికించింది..!

బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారంటూ టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లపై ఆన్ లైన్ ద్వారా సిటీ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్ కి ఆ ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేశారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. హీరోల ప్రమోషన్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని, దీంతో ఆ ముగ్గురు సినీహీరోలపైనా కేసు నమోదు చేయాలని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

మరోవైపు బెట్టింగ్ యాప్స్ కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. బెట్టింగ్ యాప్ ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆన్ లైన్ గేమింగ్ పై కఠినమైన చర్యలలో భాగంగా 385 కేసులు నమోదయ్యయి. అంతేకాక.. ఆన్ లైన్ బెట్టింగ్ ప్రమాదాల నుంచి యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ మోసాలకు గురైతే, బెట్టింగ్ మోసాలను గుర్తించినట్లతే వాట్సాప్ నెంబర్ 8712672222 కు సమాచారం ఇవ్వవచ్చునని పోలీసులు సూచించారు.