GHMC Council : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం.. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ

టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ అని కాకుండా.. ప్రభుత్వం ఇస్తోందని మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Ghmc

Conflict between TRS‌ and BJP : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చకు దారి తీసింది. టీఆర్ఎస్‌, బీజేపీ కార్పొరేటర్ల మధ్య పలు అంశాలపై వాగ్వాదం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ అని కాకుండా… ప్రభుత్వం ఇస్తోందని మాట్లాడాలని డిమాండ్ చేశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.

Drunk and Drive : ప్రాణాలు తీస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్

కౌన్సిల్ హాల్లోనే బైఠాయించి నిరసన తెలిపారు. పోడియం వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో గందరగోళం మధ్యే సమావేశాన్ని మేయర్ విజయలక్ష్మి ముగించారు.