కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వెనుక మతలబేంటి? శిక్షణ తరగతులకు విపక్ష ఎమ్మెల్యేలు వస్తారా?

అసెంబ్లీలో ఈ సారి మెజారిటీ స‌భ్యులు కొత్తగా ఎన్నికైన వారే ఉన్నారు. స‌భ‌లో మొత్తం 119 మంది స‌భ్యుల‌కు స‌గం మంది 60కి పైగా కొత్తగా ఎన్నికైన స‌భ్యులే ఉన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వెనుక మతలబేంటి? శిక్షణ తరగతులకు విపక్ష ఎమ్మెల్యేలు వస్తారా?

Telangana CM Revanth Reddy

Updated On : December 11, 2024 / 8:05 AM IST

ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది.. ఇప్పటికి మూడు అసెంబ్లీ సెషన్స్‌ కూడా పూర్తయ్యాయి.. ఈ సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.. అదే కొత్త ఎమ్మెల్యేలకు ట్రైనింగ్‌.. ఏడాది తరువాత ఇప్పుడు ట్రైనింగ్‌ ఎందుకు..? అధికారపక్షం స్కెచ్‌ ఏంటి..? కొత్త ఎమ్మెల్యేలు ఇప్పుడు కొత్తగా

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి అయ్యింది. మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీ విధివిధానాలు, నిబంధనలు అన్ని అర్ధమయ్యే ఉంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండ‌లి స‌భ్యుల‌కు శిక్షణ త‌ర‌గ‌తులు నిర్వహించాల‌ని

నిర్ణయించింది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి సంస్థలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఐతే అసెంబ్లీ స‌మావేశాలకు బ్రేక్ ఇచ్చి స‌భ్యుల‌కు ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడంలో వేరే మ‌త‌ల‌బ్‌ ఉంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన త‌ర్వాత స‌భ్యుల‌కు శిక్షణ త‌ర‌గ‌తులు ఇవ్వడంలో ఆంత‌ర్యమేంట‌నే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

అనుకున్న మైలేజ్ రాలేద‌నే ఆలోచ‌న‌?
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో అనేక ప‌నులు చేశామ‌ని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. రుణ‌మాఫీతో మొద‌లుకొని ఉద్యోగ నియామ‌కాలు ఇత‌ర‌త్రా నిర్ణయాల‌పై ప్రభుత్వం చాలా గొప్పగా చేసినా.. గ్రౌండ్‌లో అనుకున్న మైలేజ్ రాలేద‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. అంతేకాదు ప్రతిప‌క్ష స‌భ్యులు నిత్యం ప్రభుత్వంపై చేస్తున్న ఆరోప‌ణ‌లే హైలెట్ అవుతున్నాయే

త‌ప్పా.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు జ‌నంలోకి అంత‌గా పాజిటివ్‌గా వెళ్లడం లేద‌ని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌త రెండు స‌మావేశాల్లో ప్రభుత్వం అనుకున్నంత పైచేయి సాధించ‌లేక‌పోయింద‌నే టాక్ ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌లో మెజార్టీ సభ్యులు సీనియర్స్‌.. దీంతో అసెంబ్లీలో వాళ్లే బుల్డోజ్‌

చేస్తున్నారని, చర్చల్లో అధికారపక్షంపైన పైచేయి సాధిస్తున్నారని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారట.. అందుకే ఈ సమావేశాల్లో అదే సీన్‌ రిపీట్‌కాకుండా సీఎం రేవంత్‌ రెడ్డి ట్రైనింగ్‌ క్లాస్‌ల ప్లాన్‌ చేశారని టాక్‌..

అసెంబ్లీలో ఈ సారి మెజారిటీ స‌భ్యులు కొత్తగా ఎన్నికైన వారే ఉన్నారు. స‌భ‌లో మొత్తం 119 మంది స‌భ్యుల‌కు స‌గం మంది 60కి పైగా కొత్తగా ఎన్నికైన స‌భ్యులే ఉన్నారు. ఈ కొత్త స‌భ్యుల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారు 45 మంది వ‌ర‌కు ఉన్నారు. వీరంతా స‌భ‌లో ఎలా డీల్ చేయాల‌నే విష‌యాల్లో కొంత డైల‌మాలో ఉంటున్నార‌ట‌. అందుకే ట్రైనింగ్

విషయం తెరమీదకు వచ్చిందనేది పొలిటికల్‌ టాక్‌.. మరి ఈ ట్రైనింగ్‌కు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదంటే అధికారపార్టీ సభ్యులే ఉంటారా? ఈ ట్రైనింగ్‌ క్లాస్‌లతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల దూకుడు పెరుగుతందా? అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షానికి దీటుగా సమాధానమిస్తారా? వేచి చూడాలి.

CM Revanth Reddy: రేవంత్‌ రెడ్డి వ్యూహాన్ని బీఆర్ఎస్‌ ముందే పసిగట్టిందా?