Telangana Congress Party : ఆ మూడు స్థానాల్లో బరిలో నిలిచేదెవరు? ఇవాళ ప్రకటించనున్న కాంగ్రెస్

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం అభ్యర్థి విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది.

Lok Sabha Election 2024 : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అధిష్టానాలు రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వంలో వేగం పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా రోడ్ షోలు, సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో మరింత జోష్ నింపుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 నియోజకవర్గాలకుగాను 14కు పైగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ముందుకెళ్తున్నారు.

Also Read : CM Revanth Reddy : లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. భువనగిరిలో రోడ్‌షో

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 25వ తేదీ వరకు మాత్రమే నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థిగా సమీరుల్లా పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు, ఆదివారం సాయంత్రం వరకు వారి పేర్లను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Also Read : బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు.. బీజేపీలోకి వెళ్తారు: దాసోజు శ్రవణ్

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం అభ్యర్థి విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి మండవ వెంకటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, రామ సహాయం రఘురామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి టికెట్ ఫైనల్ అవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నామినేషన్లకు రేపు మంచిరోజు కావడంతో ఇవాళ సాయంత్రం వరకు మూడు పెండింగ్ నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను అధిష్టానం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు