Telangana Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీలో ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు
ఇక రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకమైన తర్వాత ఢిల్లీలో తొలిసారి తెలంగాణ వ్యవహారాలపై అధిష్ఠానం సమీక్ష నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాల అమలుపై పార్టీ పెద్దలు సమీక్షించనున్నట్లు సమాచారం. కులగణన, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఇచ్చిన హామీలు, అమలైన హామీలు, పెండింగ్ లో ఉన్న వాటిపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.
Also Read : మంత్రివర్గ విస్తరణ.. రాములమ్మకు హోంశాఖ? అమాత్య రేసులో ఉన్న నేతలకు భయం
మంత్రివర్గ విస్తరణలో ఆశావహుల జాబితా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
1) గడ్డం వివేక్ వర్సెస్ ప్రేమ్ సాగర్ రావు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
2) మదన్ మోహన్ రావు వర్సెస్ సుదర్శన్ రెడ్డి
వరంగల్ జిల్లా
3) విజయశాంతి
మెదక్ జిల్లా
4) మైనంపల్లి రోహిత్ రావు
హైదరాబాద్ జిల్లా
5) అమీర్ అలీ ఖాన్
రంగా రెడ్డి జిల్లా
6) మల్ రెడ్డి రంగా రెడ్డి వర్సెస్ రామ్మోహన్ రెడ్డి
ఉమ్మడి మహబూబ్ నగర్
7) వాకిట శ్రీహరి
ఉమ్మడి నల్లగొండ
8) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కీలక సమావేశం ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణపై మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ ఇప్పటికే ఒక నివేదికను అధిష్టానానికి ఇచ్చారు. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలి? ఏయే సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు జరగాలి అన్న అంశాలకు సంబంధించి అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. వాటిపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్చే చర్చించారు. ఫైనల్ డిస్కషన్ ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వేదికగా జరుగుతున్నాయి.
సామాజిక సమీకరణాలు, సీనియర్లు, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వారి పేర్లు, యువకులు.. వీరందరిని దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న వారిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేక ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో పాటుగా పీసీసీ నూతన కార్యవర్గ కూర్పు 6 నెలలుగా పెండింగ్ లో ఉంటూ వస్తోంది.
గతేడాది సెప్టెంబర్ లో పీసీసీ అయ్యారు మహేశ్ కుమార్ గౌడ్. ఇప్పటివరకు ఆయన తన టీమ్ ను ఏర్పాటు చేసుకోలేదు. మంత్రివర్గంలో స్థానం దక్కని వారికి పార్టీ స్థాయిలో పీసీసీ కార్యవర్గ స్థాయిలో కీలక పోస్టులు(వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షులు) ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.