Telangana Ministers
Telangana Ministers Congress High Command : తెలంగాణ నూతన ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి పదవులపై ఢిల్లీలోని అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కసరత్తు కొలిక్కి వచ్చింది. మంత్రుల శాఖలకు అధిష్టానం ఆమోదముద్ర వేసింది. దీంతో శనివారం మంత్రుల శాఖలను ప్రకటించే అవకాశం ఉంది. రాత్రి కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ వరుస భేటీలు అయ్యారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపారు. స్వల్ప మార్పులతో మంత్రుల శాఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాత్రే రేవంత్ హైదరాబాద్ కు తిరుగు పయనం అయ్యారు. తెలంగాణ మంత్రి పదవులపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మాణిక్ రావు ఠాక్రే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు.
Former Telangana CM KCR : తెలంగాణ ప్రతిపక్ష నేతగా కేసీఆర్?
మంత్రులకు శాఖల కేటాయింపుపై ఖర్గేతో చర్చలు జరిపారు. ఖర్గేతో భేటీకి ముందు కేసి వేణుగోపాల్ నివాసంలో గంటన్నర పాటు చర్చలు జరిపారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన చర్చల్లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు, ఖాళీగా ఉన్న మంత్రివర్గ స్థానాల భర్తీపై చర్చలు జరిపారు.
తన టీంలో ఎవరెవరికి ఏ ఏ శాఖలు ఇవ్వాలనులుంటున్నారో సీఎం రేవంత్ రెడ్డి నివేదిక ఇచ్చారు. కేసీ వేణుగోపాల్ తో చర్చించి మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గేతో జరిగిన సమవేవంలో రేవంత్ రెడ్డి శాఖల కేటాయింపులపై వివరించారు. ఖర్గేతో జరిగే సమావేశంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్లకు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది.