Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం : రేవంత్ రెడ్డి

రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు.

Revanth Reddy (8)

Revanth Reddy Chit Chat : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  సర్వే చేయించామని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే… ప్రస్తుత పరిస్థితుల్లో చెరో 45స్థానాలు, బీజేపీ, ఎంఐఎం ఇద్దరికీ చెరో ఏడు స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. 15 స్థానాలు టఫ్ గా ఉన్నాయి… అవి కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే అందరికీ అవకాశాలు కల్పించబడుతాయని తెలిపారు. రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు. ఓట్లు, సీట్లు కాంగ్రెస్ కు భారీ స్థాయిలో పెరుగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొడంగల్ నేత గుర్నాద రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని పేర్కొన్నారు.

Godhra Riots : గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో.. మరో 35 మందిని నిర్దోషులుగా ప్రకటించిన గుజరాత్ కోర్టు

ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే.. బీఆర్ఎస్ కు 37 %, కాంగ్రెస్ కు 35%, బీజేపి కి 14%, ఎంఐఎం కు రెండున్నర % గా ఉందన్నారు. బీఆర్ఎస్ ఓట్ల శాతం, సీట్లు ఎన్నికల నాటికి భారీ స్థాయిలో తగ్గుతాయని తెలిపారు. అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని.. అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక తామే ప్రకటిస్తామని చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే చెబుతామని పేర్కొన్నారు.