Revanth Reddy : కాంగ్రెస్ సభకు వచ్చేవారిని అడ్డుకుంటున్న పోలీసులు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్ కోరారు. సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలిస్తామని రేవంత్ కు డీజీపీ తెలిపారు.

Revanth Reddy

Revanth Complaints To DGP : ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గ్రామాల నుంచి సభకు బయలుదేరిన వాహనాలను అడ్డుకోవడంపై సీరియస్ అయ్యారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై డీజీపీతో ఫోన్ లో రేవంత్, మధుయాష్కీ మాట్లాడారు.

సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్ కోరారు. సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలిస్తామని రేవంత్ కు డీజీపీ తెలిపారు. అడ్డుగోడలు దాటుకునైనా సభకు హాజరవుతామని రేవంత్, మధుయాష్కీ స్పష్టం చేశారు. ఖమ్మం సభకు హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి, మధుయాష్కీ హుటాహుటిన బయలుదేరారు.

MLA Seethakka : రాహుల్ రాకను తట్టుకోలేక.. ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు పెట్టి నిర్బంధిస్తున్న బీఆర్ఎస్ : ఎమ్మెల్యే సీతక్క

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరుగనుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారు. అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని, ప్రసంగించనున్నారు.