Jagga Reddy : ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో ఉన్నారో ఎన్నికలయ్యాక తెలుస్తుంది- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ మాటలకు ఆగస్టులో సమాధానం చెబుతాం.

Jagga Reddy : కాంగ్రెస్ కు చెందిన 23మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. తీవ్ర వ్యాఖ్యలతో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. మా ఎమ్మెల్యేలు కేసీఆర్ కి టచ్ లో ఉన్నారా? వాళ్ళ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారా? అనేది ఎన్నికలు అయ్యాక తెలుస్తుంది అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

”కేసీఆర్ బయటకి వస్తే మా అస్త్రాలు మేం బయటకి తీస్తాం. రేవంత్ రెడ్డి తోపు, భట్టి ఇంకో రకం తోపు, ఉత్తమ్ బ్రిలియంట్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ తోపే. పొంగులేటి, రేణుక చౌదరి, జీవన్ రెడ్డి, వీహెచ్ తోపులు. పొన్నం, శ్రీధర్ బాబు తోపులే. కాంగ్రెస్ లో అందరూ తోపులే. కేసీఆర్ ఏం చేసినా మాకు ఏీ కాదు. బీఆర్ఎస్ లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లు. కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు కొదవ లేదు. మేం పాండవులం. విజయం మావైపే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీకి పూర్తి నమ్మకం ఉంది. బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో అమిత్ షా, మోదీలకు నిద్ర పట్టడం లేదు.

కేసీఆర్ ఏం మాట్లాడినా మా వ్యూహం మాకు ఉంది. మేం చాలా అలర్ట్ గా ఉన్నాం. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ మాటలని ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. మాకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. రేవంత్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ మాటలకు ఆగస్టులో సమాధానం చెబుతాం. ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ ఏ ఆలోచనతో అన్నారో ఆయనకే తెలియాలి. కేసీఆర్ ఏం చేసినా దాన్ని ఎలా తిప్పికొట్టాలో మాకు తెలుసు.

బీజేపీ వాళ్ళు దేశభక్తులు అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. అసలైన దేశభక్తులు రాహుల్ గాంధీ కుటుంబమే. రాహుల్ గాంధీకి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ బీజేపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు గ్రాఫిక్స్ హీరోలు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో పస లేదు” అని జగ్గారెడ్డి అన్నారు.

Also Read : హైటెన్షన్ వైరు లాంటోడిని, టచ్ చేసి చూడు మాడిపోతావ్- కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు