Jaggareddy
Jaggareddy Interesting comments : సంగారెడ్డి జిల్లా అధికారులకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుకుం జారీ చేశారు. తన భార్య నిర్మలను ప్రభుత్వం కార్యక్రమాలకు ఆహ్వానించాలని అన్నారు. తన భార్య సంగారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమెను అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాల్సిందేనంటు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో చింతా ప్రభాకర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంటూ గుర్తు చేశారు.తాను ఆ విషయాన్ని ఎప్పుడు తప్పుపట్టలేదని వివరించారు.
తన భార్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆమెను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాలని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో తన భార్యను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాలని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో మీరు ఏం చేసినా తాను ఎప్పుడు ప్రశ్నించలేదని ఇప్పుడు మాత్రం కుదరదన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారులందరికి చెబుతున్నానంటూ జగ్గారెడ్డి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy : మహా లక్ష్మీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
కాగా..తెలంగాణ ఏర్పడిన తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం..ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం..మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి అయ్యింది. తొలిసారి అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి..వెంటనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా రెండు గ్యారెంటీలను ప్రారంభించారు. మహాలక్ష్మీ, రాజీవ్ ఆరోగ్య పథకాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించారు.
ఈక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తన భార్య జిల్లా అధ్యక్షురాలు కాబట్టి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాలని హుకుం జారీ చేశారు. కాగా..2018 బీఆర్ఎస్ హవాలో కూడా జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కానీ..ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా జగ్గారెడ్డి మాత్రం ఓటమిపాలవ్వటం గమనించాల్సిన విషయం.