Uttam Kumar Reddy : కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే దమ్ము కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరించాలని నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారాయన. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మహేష్ రెడ్డి ప్రారంభించడం చాలా సంతోషకరం అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని చెప్పారాయన. భారత దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి విడదీస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారని, ఈ దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని భట్టి విక్రమార్క చెప్పారు.
ఈ దేశం మనది ఈ సమాజం మనది అనే విధానంతో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించలేదన్నారు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, కుటుంబసభ్యులు మాత్రమే సంతోషంగా సుఖంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా సమస్యలతో సతమతమవుతున్నారని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని భట్టి విక్రమార్క ఓటర్లను కోరారు.
రేవంత్‌ది, తనది కాంగ్రెస్ యాత్రలేనని.. రెండూ హాత్ సే హాత్ జోడో యాత్రలేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే కుటుంబమని.. సీనియర్లు వారి అనుకూలతను బట్టి యాత్రలకు హాజరవుతారని మహేశ్వర్ రెడ్డి తేల్చేశారు. అందరం కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్, నేతలు వున్నారని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.(Uttam Kumar Reddy)
తెలంగాణ కాంగ్రెస్ కార్యక్రమాల అమలు ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి విడిగా పాదయాత్ర ప్రారంభించారు. సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి హైదరాబాద్ వరకు మొదటి విడతగా దాదాపు 10 రోజుల పాటు ప్రజా సమస్యలపై పోరు యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. బాసర లోని సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్రను మొదలు పెట్టారు. టీపీపీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గంలో యాత్రను ప్రారంభించి.. హుజూర్ నగర్ నియోజక వర్గంతో పాటు నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు మహేశ్వర్ రెడ్డి యాత్రకు హాజరయ్యారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
రేవంత్‌ది, తనది కాంగ్రెస్ యాత్రలేనని.. రెండూ హాత్ సే హాత్ జోడో యాత్రలేనని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే కుటుంబమని.. సీనియర్లు వారి అనుకూలతను బట్టి యాత్రలకు హాజరవుతారని మహేశ్వర్ రెడ్డి తేల్చేశారు. అందరం కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామన్నా విశ్వాసం వ్యక్తం చేశారు.