Jeevan Reddy : అలాంటి వారికి డబ్బులు ఎందుకు? రైతుబంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సాగు భూములకు కచ్చితంగా పెట్టుబడి సాయం అందిస్తుందని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి.

MLC Jeevan Reddy On Rythu Bandhu Scheme

రైతుబంధుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు డబ్బులు పోతున్నాయని ఆరోపణలు గుప్పించారు. ధరణిలో పేరుండి భూమి లేని వారి గురించి పునరాలోన చేయాలన్నారు జీవన్ రెడ్డి. సాగు చేసే భూములకే రైతుబంధు అందేలా చూడాలని చెప్పారు. బీఆర్ఎస్ ఇచ్చిన 5వేలకు 2వేల500 కలిపి 7వేల 500లు ఇస్తామన్నారు జీవన్ రెడ్డి.

మరోవైపు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ చివరిలోపు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని హామీ ఇచ్చారు. అయితే పంట సాగు చేసే నిజమైన రైతులకే ఈ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం త్వరలోనే సమీక్ష నిర్వహించనుందని వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం చేసే ముందు ధరణిలో లోపాలను పరిశీలించాల్సి ఉందన్నారాయన.

Also Read : యశోద ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన.. రేవంత్ అన్న అంటూ పిలిచిన మహిళ.. సీఎం ఏం చేశారంటే.. వీడియో వైరల్

కొందరు భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్ని వందల ఎకరాల భూములను సాగు భూములుగా చూపిస్తు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందుతున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. అలాగే ధరణిలో తప్పు ఒప్పులను పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సాగు భూములకు కచ్చితంగా పెట్టుబడి సాయం అందిస్తుందని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఎకరాకు రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందుతుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి తమకు ఇచ్చిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ హామీల అమలు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు సంక్షేమ పథకాలను కూడా ఆపబోమని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఎకరాకు రూ.7500 చొప్పున సాయం అందజేయనున్నామని చెప్పారు.

Also Read : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం

 

ట్రెండింగ్ వార్తలు