Komatireddy Venkat Reddy
Mp Komatireddy Venkat Reddy : తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy )మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా ఏ నేతలు చేరనవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నల్లగొండ జిల్లా(Nalgonda District)ను ఉద్దేశించి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ(Congress Party Seats)లోని నేతలు కొత్తగా చేరాల్సిన అవసరం లేదు ఇప్పటికే సీట్లన్నీ ఫుల్ అయిపోయాయ్ అంటూ వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలకు 12 ఫుల్ రిజర్వ్ (Congress Party 12 Seats)అయిపోయాయి ఇక కొత్తగా ఏ నేతలు చేరాల్సిన అసవరం లేదు అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలోని నేతలను ఆహ్వానించటానికి అన్ని పార్టీలు తలుపులు బార్లా తెరుకుని కూర్చుకుంటారు. దీంట్లో భాగంగానే తెలంగాణలో కూడా త్వరలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో కాంగ్రెస్ లోకి పలువురు నేతలను ఆహ్వానిస్తున్నారు.ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు పార్టీలో చేరారు.బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు తమతో టచ్ లో ఉన్నారని వారంతా త్వరలో కాంగ్రెస్ లో చేరతారని రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీకాంగ్రెస్ నేతలు అంటున్నారు.ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లోకి ఏ నేతలు చేరాల్సిన అవసరం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. మాజీ MLA వేముల వీరేశం, శశిధర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారంటూ వార్తలు వస్తున్న వేళ వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.
Vijayashanthi : విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ఖండించిన విజయశాంతి
కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ పార్టీల నుంచి నేతలు, క్యాడర్ వచ్చినా ఏపార్టీలు వద్దని చెప్పవు. ఎందుకంటే క్యాడర్ పెరిగితే ఓటు బ్యాంకు కూడా పెరుగుతుంది. అదే నేతలు చేరితే వారి అనుచర వర్గాలు..ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కలిసి వస్తుంది. మరి ముఖ్యంగా ఎన్నికల వేళ ఇటువంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. పార్టీ బలాన్ని పెంచుకోవటానికి ఈ చేరికలను ఆయా పార్టీలు అనుసరిస్తుంటాయి. వచ్చిన నేతలను..క్యాడర్ ను చేర్చుకుంటుంటాయి.
కాగా తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ గతంలో కంటే బెటర్ గా పనిచేస్తోంది. మరి ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కూడా జోష్ పెరిగింది. గెలుస్తామనే నమ్మకాన్ని పెంచింది. దీంతో గతంలో ఉండే అభిప్రాయబేధాలను పక్కన పెట్టి నేతలంతా కలిసి పనిచేస్తున్నారు.మరి ముఖ్యంగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అడ్డాగా ఉంటుంది.అటువంటి జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ బాగా బలంగా ఉండేవారు గతంలో. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి బీజేపీకిలో చేరినా అక్కడ బలం తగ్గకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.
ఈక్రమంలో కోమటిరెడ్డి తనదైన శైలిలో నల్లగొండ జిల్లాలో ఏ నేతలు చేరాల్సిన అసవరం లేదని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.
Chikoti Praveen : చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బంది కేసు రిమాండ్ రిపోర్ట్.. పరారీలో చికోటి