Congress GHMC election manifesto : కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. వరద బాధితుల కుటుంబాలకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు రూ.2.5 లక్షల చొప్పున సహాయం చేస్తామన్నారు. ఎన్డీఎంఏ మార్గదర్శకాలను అమలు చేస్తామని చెప్పారు.
https://10tv.in/pawan-kalyan-ready-for-another-sacrifice/
ఆస్తి పన్నును హేతుబద్ధీకరిస్తామని పేర్కొన్నారు. వైద్య విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రిస్తామని తెలిపారు. స్లమ్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాలాల పూడిక తీత పనుల్ని ఎప్పటికప్పుడు చేపడతామని వివరించారు. కేబుల్ ఆపరేటర్లకు పోల్ ఫీజు రద్దు, మంచినీరు ఉచితం, అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజీ ట్యాంకులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
హెచ్ఎండీఏ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థను రూపొందించి అమలు చేస్తాం
కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తాం
80 గజాల లోపు ఇళ్లకు పూర్తిగా ఇంటి పన్ను మాఫీ
గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఆస్పత్రులను ప్రత్యేకంగా మెరుగుపరుస్తాం
బస్తీ దవాఖానాల సంఖ్యను 450కి పెంచుతాం
పత్రి 100 దవాఖానాలకు ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి
జీహెచ్ఎంసీ లైబ్రరీలో దివ్యాంగులకు లైబ్రరియన్ కొలువులు
విద్యుత్ 100 యూనిట్లలోపు బిల్లులు పూర్తిగా రాయితీ
80 గజాల లోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి ఆస్తిపన్ను ఉండదు
దరణి పోర్టల్ ను రద్దు చేస్తాం
ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు, ఉచిత నల్లా కనెక్షన్
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లేకుండా చేస్తాం
ఆస్తి పన్ను హేతుబద్ధీకరణ రూ.50 వేలలోపు రాయితీ
ఇంటి స్థలం ఉన్న వారికి రూ.8 లక్షలు ఇస్తాం
వరదల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా
మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ లలో ఉచిత రవాణా సదుపాయం
మెట్రో రైలు సేవలను, ఎంఎంటీఎస్ సర్వీసులను పాతనగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తాం