Mahesh Kumar Goud
Mahesh Kumar Goud: సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. పది సంవత్సరాలు కాకున్నా దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని, తద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం రాష్ట్రాన్ని కొల్లగొట్టిందంటూ విమర్శలు చేశారు.
Ponnam Prabhakar: సంజయ్ ఓసారి ఆస్పత్రిలో చూపించుకో.. కవిత కోసం సిద్ధంచేసిన జైలు రూం ఏమైందో చెప్పు..
హరితహారం పేరుతో ప్రజా ధనాన్ని దోచుకున్నారని, హరితహారానికి 11వేల కోట్లు ఖర్చు చేశామని కేసీఆర్ చెబుతున్నారని, రాష్ట్రంలో హరిత హరానికి 11 వేల కోట్లు ఖర్చు చేసి మొక్కలు ఎక్కడ నాటారని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పిన లెక్కలకు వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. హరితహారం కోసం చేసిన ఖర్చులో 70శాతం డబ్బులు దోచేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హరితహారంలో విచ్చలవిడిగా డబ్బులు దోచేశారని, సర్కార్ చెబుతున్నట్లు నాటిన మొక్కలకు రాష్ట్ర భూమి సరిపోదని అన్నారు.
హారితహారంలో ప్రభుత్వం చెబుతున్నవన్ని కాకి లెక్కలు, కేసీఆర్ చెప్పేవన్నీ వాస్తవాలైతే సమగ్ర విచారణకు ఆదేశించాలని మహేష్ కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. నీళ్ళ దోపిడీ, ఇసుక దోపిడీ, చెట్ల పేరుతో దోపిడీ, ప్రాజెక్టుల పేరుతో దోపిడీ, లిక్కర్ దోపిడీ ఇలా.. అన్నివిధాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హరితహారం అవినీతిపై విచారణ జరిపిస్తాం. మొక్క మొక్కకు లెక్కతీస్తాం అని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. సచివాలయం నిర్మాణంలో అవినీతి జరిగింది, అమరవీరుల స్థూపం నిర్మాణంలోకూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై నిపుణుల కమిటీ వేసి విచారణ జరిపిస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.