Congress Candidate Changed : కాంగ్రెస్ మూడో జాబితాలో మార్పులు.. చివరి నిమిషంలో నారాయణఖేడ్ అభ్యర్థిని మార్చిన అధిష్టానం

మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. పటాన్ చెరు, నారాయణఖేడ్ సీట్లను తన అనుచరులకు ఇప్పించారు.

Congress third list candidates change

Congress Third List  Candidate Changed : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి. నారాయణఖేడ్ సీట్ ను మూడో విడత జాబితాలో సురేష్ షట్కర్ కు కేటాయించారు. అయితే తాజాగా ఆ సీటును సంజీవరెడ్డికి కేటాయించారు. సురేష్ షట్కర్, సంజీవరెడ్డి మధ్య కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాజీ కుదుర్చారు. సురేష్ షట్కర్ జహీరాబాద్ ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు.

మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. పటాన్ చెరు, నారాయణఖేడ్ సీట్లను తన అనుచరులకు ఇప్పించారు. మొదట్లో దక్కక పోయినా మళ్లీ చివరి నిమిషంలో.. దామోదర దక్కించుకున్నారు. ఆఖరికి రాజనర్సింహ తన అనుచరులకు టికెట్లు వచ్చే విధంగా ప్రయత్నించారు. పటాన్ చెరు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, నారాయణఖేడ్ నుంచి సంజీవరెడ్డికి ఇప్పించుకోగలిగారు.

Big Shock BRS : బీఆర్ఎస్ కు భారీ షాక్.. మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్ లో చేరిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతోపాటు పఠాన్ చెరు అభ్యర్థిని మార్చింది. పఠాన్ చెరు టికెట్ ను గతంలో నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. ఆయన స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. ఇక సూర్యపేట టికెట్ ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఇచ్చింది.

కాగా, అద్దంకి దయాకర్ కు అధిష్టానం షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తుంగతుర్తి సీటుపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తుంగుర్తి టికెట్ తనకే ఇస్తారని ఆశించారు. కానీ, కాంగ్రెస్ హైకమాండ్ దయాకర్ కు మొండి చూపించారు. తుంగతుర్తి టికెట్ ను దయాకర్ కు కాకుండా శామ్యూల్ కు కేటాయించింది.