Astrologer VenuSwami: వేణుస్వామిని గుడి నుంచి తరిమేసిన కామాఖ్య అర్చకులు.. వీడియో చూస్తారా?

కామాఖ్య గుడిలో దోష నివారణ పూజలు అంటూ వేణుస్వామి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారని విమర్శించారు.

Astrologer Venu Swami

Astrologer VenuSwami: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే జ్యోతిష్యుడు వేణుస్వామికి షాక్ ఇచ్చారు కామాఖ్య దేవి టెంపుల్ అర్చకులు. అసోం కామాఖ్య దేవాలయం నుంచి వేణుస్వామిని వారు బయటకు తరిమేసిన్నట్టు తెలిసింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇటీవల కామాఖ్య దేవి ఆలయానికి వేణుస్వామి వెళ్లగా అక్కడి పండితులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.

వేణుస్వామిని లోపలికి వెళ్లనివ్వకుండా దేవాలయం నుంచి అర్చకులు బయటకు తోసినట్లుగా తెలుస్తోంది. “గత కొన్ని రోజులుగా నీ బాగోతం అంతా చూస్తున్నాం” అంటూ వేణుస్వామిని అర్చకులు అడ్డుకున్నారు.

కామాఖ్య అమ్మవారి ప్రతిష్ఠను దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారంటూ వేణుస్వామిపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “నీలాంటి దొంగ స్వామీజీలను నమ్మబోం” అంటూ వేణుస్వామిని అర్చకులు కించపర్చారు.

వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

పిల్లలులేని దంపతులు కామాఖ్య అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే ఏడాది లోపు పిల్లలు పుడతారని వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆ ప్రదేశంలో పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తారని హాట్ కామెంట్ చేశారు. ఆలయ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా మాట్లాడిన వేణుస్వామి పై నెటిజన్లు ఫుల్ ఫైర్ అయ్యారు.

అమ్మవారి ఆలయం గురించి అలాంటి అపచారపు మాటలు మాట్లాడడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. (Astrologer VenuSwami)

వాగ్వాదానికి దిగిన అర్చకులు

ఈ నేపథ్యంలోనే కామాఖ్య టెంపుల్ కు వెళ్లిన వేణుస్వామిపై ఆలయ అర్చకులు వాగ్వాదానికి దిగారు. కామాఖ్య గుడిలో దోష నివారణ పూజలు అంటూ వేణుస్వామి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారని విమర్శించారు.

ఎవరైనా ఏదైనా పూజలు హోమాలు చేయించుకోవాలనుకుంటే నేరుగా తమను కలవాలని అర్చకులు చెబుతున్నారు. వేణుస్వామి చేసే పూజలను తాము కూడా చేస్తామన్నారు.

పూజలకు లక్షల రూపాయలు ఖర్చు కాదని, అతి తక్కువ ఖర్చుతోనే పూజలని చేస్తామని, వేణుస్వామి మాటలను ఎవ్వరు నమ్మొద్దని అర్చకులు చెబుతున్నారు.

వేణుస్వామి గతంలోనూ వివాదాల స్వామిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో సినిమా యాక్టర్ల గురించి వివాదాస్పదంగా మాట్లాడారు.

ప్రముఖుల పేర్లు నేరుగా ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో మహిళా కమిషన్ కూడా వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది.