Corona for Revanth : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Corona for MP Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో కరోనా టెన్షన్ పెరుగుతోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24గంటల్లో 412 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో కరోనా కేసులు 4వందలు దాటడం ఇదే ప్రథమం. ఇంకో 8వందలకు పైగా రిపోర్టులు రావాల్సి ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటెల రాజేందర్‌…. పరీక్షల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో బెడ్లను సిద్ధం చేయాలని సూచించారు.

కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో… అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోనుంచి బయటకు రావొద్దని తెలంగాణ వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో జిల్లాల్లో కేసుల తీవ్రత పెరుగకుండా చర్యలు తీసుకుంటోంది.

అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో… 90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో సమస్య తీవ్రమవుతోంది. అంటే.. చాలామంది సూపర్ స్ప్రెడర్‌లుగా మారారు. దీంతో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అలాగే.. రోజుకు 50 నుంచి 70 కేసులు పెరుగుతుండటంతో పాజిటివిటీ రేటు పెరిగిందని అధికారులంటున్నారు. మాస్కులు దరించకపోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం కేసుల సంఖ్య పెరగడానికి కారణంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు