Telangana University Corona : తెలంగాణ యూనివర్సిటీలో మళ్లీ కరోనా విజృంభణ

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Telangana University Corona : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఐసోలేషన్ లో ఉంచారు. కరోనా భయంతో చాలామంది స్టూడెంట్స్ ఇంటిబాట పట్టారు.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. మరోరోజు భారీగా కేసులు నమోదు

రెండు రోజుల క్రితం పలువురు విద్యార్థుల్లో లక్షణాలు కనిపించాయి. దీంతో తెలంగాణ యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. తొలుత బాయ్స్‌ హాస్టల్‌లో విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా వారికి కరోనా పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో క్యాంపస్‌లోని హెల్త్‌ సెంటర్‌లో 110 మంది విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షలు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు హాస్టల్‌తో పాటు వర్సిటీ ప్రాంగణాన్ని శానిటైజ్‌ చేయించారు. ఇదిలా ఉండగా.. యాదాద్రి జిల్లా రామన్నపేట వసతి గృహంలోనూ కరోనా కలకలం రేపింది. ఎస్సీ బాలుర వసతిగృహంలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

యూనివర్సిటీలో గత మూడు రోజుల్లో 170మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో వర్సిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. వర్సిటీలో ప్రత్యేకమైన టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అలాగే బూస్టర్ డోసులు ఇస్తున్నారు. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం వర్సిటీకి చెందిన విద్యార్థులు హైదరాబాద్ లో ఓ సదస్సుకు హాజరై వచ్చారు.

ఆ తర్వాత కొందరు విద్యార్థులకు తీవ్రమైన జ్వరం వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. కొందరిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచగా, మరికొందరిని హోం క్వారంటైన్ లో ఉంచారు. కరోనా కేసులు వెలుగుచూడటంతో వర్సిటీలో పని చేసే సిబ్బంది కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ముందుజాగ్రత్తగా అందరికీ బూస్టర్ డోసులు ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు