Udyoga Deeksha : షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న 10 మందికి కరోనా

వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న కొంతమంది కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. దాదాపు 10 మందికి వైరస్ ఉందని నిర్ధారణ కావడంతో ఉద్యోగ దీక్షకు వచ్చిన వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.

Sharmila : వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న కొంతమంది కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. దాదాపు 10 మందికి వైరస్ ఉందని నిర్ధారణ కావడంతో ఉద్యోగ దీక్షకు వచ్చిన వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మూడ్రోజుల కిందట వైఎష్ షర్మిల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. లోటస్ పాండ్ లో 72 గంటల పాటు దీక్ష కొనసాగించారు.

ఈ దీక్షకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మందే వచ్చారు. అనంతరం ఏప్రిల్ 18వ తేదీ ఆదివారం దీక్ష విరమించారామె. అయితే..దీక్ష అనంతరం పలువురు కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీక్షలో షర్మిల వెంటే ఉన్న పిట్టా రాంరెడ్డికి, మరో ఇద్దరు షర్మిల అనుచరులు, సెక్యూర్టీ సిబ్బందికి వైరస్ ఉందని తేలింది. 2021, ఏప్రిల్ 19వ తేదీ సోమవారం మరికొంతమంది కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఈ పరిస్థితులతో షర్మిల మూడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారని సమాచారం.

Read More : IIT Kanpur : మే నెల జరభద్రం, కరోనా ఉధృతంగా ఉండనుంది – ఐఐటీ కాన్పూర్

ట్రెండింగ్ వార్తలు