జనం చేతుల్లో డబ్బులు పెట్టండి.. విమర్శలకు సమయం కాదు.. : రాహుల్ గాంధీ

  • Publish Date - May 16, 2020 / 07:36 AM IST

కోవిడ్ -19 మరియు ఆర్థిక సంక్షోభం విషయాలపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ కారణంగా పేదలు, వలసకూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పేదలకు నేరుగా నగదు సాయం అందజేయాలని.. వారి బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని నేరుగా జమచేయాలని ప్రధానిని కోరారు రాహుల్ గాంధీ. జనం చేతుల్లో డబ్బులు పెట్టాలని ఆయన అన్నారు. 

‘చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజీని నిజాయతీగా అమలు చేయాలన్నారు దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాలని, భారత నిర్మాణంలో వలస కార్మికులదే కీలక పాత్ర అన్నారు. భవిష్యత్తులోనూ వారు కీలక భాగస్వాములుగా ఉంటారు. వలస కార్మికులకు ఇప్పుడు డబ్బు అవసరం’ అని రాహుల్ గాంధీ అన్నారు.

వలసకూలీల ఆవేదనను జర్నలిస్ట్‌లు నిజాయితీగా చూపుతున్నారని అన్నారు. వలసకూలీలకు ప్రభుత్వం సాయం చేయాలన్నారు. నా సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నారు రాహుల్. ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడం గురించి ప్రధాని మోడీ తీవ్రంగా ఆలోచించాలని కొరారు. ఆర్థిక ప్యాకేజీ పంపిణీ విషయంలో కేంద్రం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

జీవనోపాధికి, ప్రజల ఆరోగ్యానికి మధ్య భేరీజులు వేసుకుంటూ లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ఆయన కోరారు. మన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని అన్నారు. ఇదే సమయంలో ‘వలసదారుల పరిస్థితి’కి ఎవరు బాధ్యత వహించాలనే విషయమై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది వేలెత్తి చూపించే సమయం కాదని, వలసదారుల సమస్య పెను సవాలుగా మారిందని అన్నారు. మనమందరం రహదారులపై నడుస్తున్న వారికి సహాయం చేయాలన్నారు.

Read Here>>  Corona తగ్గినా Doctorను ఇంట్లో పెట్టి తాళం వేశారు

ట్రెండింగ్ వార్తలు