CP Satyanarayana : ప్రేమికుడి దాడిలో యువతి మృతి.. లవ్ జిహాద్ కు సంబంధం లేదు, ప్రేమలో తలెత్తిన ద్వేషం మాత్రమే : సీపీ సత్యనారాయణ

ఐదేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారని పేర్కొన్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పారు. నిందితుడిని తేజశ్రీ దూరంగా పెట్టారని తెలిపారు.

CP Satyanarayana

Tejashree Case – CP Satyanarayana : నిజామాబాద్ జిల్లాలో ప్రేమికుడి దాడిలో యువతి మృతి చెందిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని జక్రాన్ పల్లిలో ప్రేమికుడి దాడిలో గాయపడి మృతి చెందిన యువతి తేజశ్రీ ఘటనలో సీపీ సత్యనారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ మేరకు శనివారం సీపీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నిందితుడు తౌసిఫుద్దిన్ ను అరెస్టు చేశామని తెలిపారు.

ఐదేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారని పేర్కొన్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పారు. నిందితుడిని తేజశ్రీ దూరంగా పెట్టారని తెలిపారు. కోపంతో తేజశ్రీపై నిందితుడు తీవ్రంగా దాడి చేశాడని వెల్లడించారు. మొదట తేజశ్రీ బండి మీది నుంచి పడిందని, దూకిందని నిందితుడు బుకాయించాడని పేర్కొన్నారు.

Mahender Reddy: తహశీల్దార్‌ ఇంట్లో రూ.2 కోట్ల కరెన్సీ, భారీగా బంగారం

లేని అనుమానం పెంచుకుని తేజశ్రీని చంపాలని నిందితుడు దాడి చేశాడని స్పష్టం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. అయితే లవ్ జిహాద్ కు ఈ ఘటనకు సంబంధం లేదని.. ప్రేమలో తలెత్తిన ద్వేషం మాత్రమేనని సీపీ వెల్లడించారు.