శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలి.. ‘హైడ్రా’ వల్ల వీళ్లు జైలుకి వెళ్తారు: సీపీఐ నారాయణ

సీపీఐలో కష్టపడి పని చేసిన బాల మల్లేశ్, శ్రీనివాస్ రావు రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారని చెప్పారు.

CPI Narayana

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా తీసుకుంటున్న చర్యలతో బడా బాబులు అయినా జైలుకు వెళ్లిల్సి వస్తుంది లేదా వాళ్ల ఒత్తిడి వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.

హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముగ్ధుమ్ భవన్‌లో నారాయణ మీడియాతో మాట్లాడారు. దేశంలో అవినీతి పెరిగిపోతోందని నారాయణ అన్నారు. ప్రధానిగా మోదీ ఎన్నికయ్యాక అవినీతి చేయాల్సిన అవసరం ఆయనకు లేదన్నారని, 2014లో రూ.2.25 లక్షల కోట్లు ఐపీ ఉంటే, ఇప్పుడు రూ.16 లక్షల కోట్లు ఉందని తెలిపారు.

బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న ఎగ్గొట్టిన వారిలో విజయ్ మాల్యా తప్ప మిగతా వారు అందరూ గుజరాత్ వాళ్లేనని చెప్పారు. మోదీ వల్లే అదానీ అభివృద్ధి చెందారని, అంతేగానీ, సొంతంగ కాదని ఆరోపించారు.

పదేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలకు జాతీయ సీపీఐ పిలుపు ఇచ్చిందని తెలిపారు. కాగా, సీపీఐలో కష్టపడి పని చేసిన బాల మల్లేశ్, శ్రీనివాస్ రావు రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారని చెప్పారు. పశ్య పద్య జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారని తెలిపారు.

Also Read: తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా తీసుకురావాలి.. వాటిని కూల్చేయాలి: కాంగ్రెస్ నేతల విజ్ఞప్తులు

ట్రెండింగ్ వార్తలు