Only six : TRS లో అసలైన తెలంగాణవాదులు ఆరుగురే ఉన్నారు

TRS నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బయటకు వెళ్లటం..ఏపీ సీఎం జగన్ రద్దు విషయాలపై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా వాదాన్ని ఎజెండాగా తీసుకుని ఆవివర్భవించిన టీఆర్ఎస్ పార్టీలో అసలైన తెలంగాణ వాదులు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారని వ్యాఖ్యానించారు.

Cpi Narayana

CPI Narayana’s key Comments : TRS నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బయటకు వెళ్లటం..ఏపీ సీఎం జగన్ రద్దు విషయాలపై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా వాదాన్ని ఎజెండాగా తీసుకుని ఆవివర్భవించిన టీఆర్ఎస్ పార్టీలో అసలైన తెలంగాణ వాదులు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లోంచి బయటకు వెళ్లటం ఆ పార్టీకి నష్టమనేనని అన్నారు. తెలంగాణ మరో బెంగాల్ లా మారకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్బంగా నారాయణ సూచించారు. అలాగే ఏపీ సీఎం జగన్ బెయిల్ గురించి కూడా మాట్లాడుతూ..జగన్ కు బెయిల్ రద్దు అయ్యే అవకాశాలున్నాయని అన్నారు.

ఇదిలా ఉంటే..ఈటల రాజేందర్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది. టీఆర్ఆర్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన రాజేందర్ తరువాత రెండు సార్లు మంత్రి అయ్యారు. ఈ క్రమంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరేందుకు సిద్దమైయ్యారు. ఈక్రమంలో టీఆర్ఎస్ నేతలకు ఈటలకు మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. తీవ్ర విమర్శలతో ఒకరిపై మరొకరు మాటల యుద్దాలు కొనసాగిస్తున్నారు. నువ్వంటే నువ్వని మాటలతో విమర్శించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈటల రాజీనామా తర్వాత పరిణామాలు ఎదుర్కొనేందకు బీజేపీ పక్కా వ్యూహరచన అమలు చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తన ఎంట్రీతో తెలంగాణలో బీజేపీ బలోపేతం చేసేందుకు పార్టీ అగ్రనాయత్వంతో ఈటల చర్చించినట్లు సమాచారం. ఈటల చేరికపై బండి సంజయ్ ఇప్పకికే ఓ స్పష్టత ఇచ్చిన క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. మరి సొంత పార్టీని వీడి బీజేపీలోకి చేరాక ఈటలకు ఎటువంటి గౌరవం దక్కుతుందో వేచి చూడాలి..