Viral Video: వేగంగా వెళ్తున్న బస్సు కింద పడబోయిన బాలిక.. వెంట్రుకవాసిలో తప్పించుకుని..

ఆ బస్సు వెనకాల నుంచి ఓ బాలిక రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుంది. ఆ బస్సు అడ్డుగా ఉండడంతో

Viral Video: వేగంగా వెళ్తున్న బస్సు కింద పడబోయిన బాలిక.. వెంట్రుకవాసిలో తప్పించుకుని..

Viral Video

Updated On : August 26, 2023 / 9:31 PM IST

Viral Video: రోడ్డు దాటుతున్న సమయంలో కొద్దిపాటి నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకే ముప్పు. తెలంగాణలోని సైబరాబాద్ (CYBERABAD) ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాల గురించి వీడియోల ద్వారా వివరించి చెబుతూ అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా, ఓ వీడియోను పోస్ట్ చేశారు. రోడ్డుపై నుంచి ఓ స్కూలు బస్సు వెళ్తుంది.

ఆ బస్సు వెనకాల నుంచి ఓ బాలిక రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుంది. ఆ బస్సు అడ్డుగా ఉండడంతో రోడ్డుపై మరో వాహనం వస్తుందా? లేదా? అన్న విషయాన్ని ఆ బాలిక తెలుసుకోలేకపోతుంది. ఆ బస్సుకి వ్యతిరేక దిశలో రోడ్డుకి ఎడమవైపు నుంచి మరో స్కూలు బస్సు దూసుకొస్తుంది.

దాన్ని చూసుకోకుండా బాలిక రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారిగా తన ముందు కనపడిన బస్సుని చూసి ఆ బాలిక ఆగుతుంది. వెంట్రుకవాసిలో బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. దీంతో ఆ బాలికను చూస్తూ అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఏదైనా భారీ వాహనం రోడ్డుపై వెళ్తున్న సమయంలో దాని వెనకాల నుంచి పాదచారులు రోడ్డును దాటే ప్రయత్నం చేయొద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు.