Cyclone Gulab టెన్షన్.. కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్

నేటి రాత్రి నుండి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అ

Cyclone Gulab Somesh

Cyclone Gulab : నేటి రాత్రి నుండి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరించడంతో కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. సీఎంల సమావేశంలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ తో వెళ్లిన సోమేశ్ కుమార్ అక్కడ నుండే కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

నేటి రాత్రి నుంచి మరో రెండు రోజుల పాటు గులాబ్ తుపాన్ ప్రభావం రాష్ట్రం మొత్తంపై ఉన్నందున ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలిపారు.

Bank Holidays: అక్టోబరులో బ్యాంకులకు 21రోజుల పాటు సెలవులు

జిల్లాల్లో పోలీస్ ఇతర లైన్ డిపార్ట్ మెంట్లతో సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా వహించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సాయం తీసుకోవాలన్నారు. వాగులు, వంకల నుండి వరద నీరు ప్రవాహిస్తున్న సమయంలో వాటిని దాటకుండా ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచాలన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని, స్థానికుల సాయంతో వరద నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. చెరువులు, పూర్తిగా నిండిన జలాశయాల్లో నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

Lock Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ తీరంవైపు కదులుతోంది. ఇవాళ అర్థరాత్రి పలాస- టెక్కలి నియోజకవర్గాల మధ్య గులాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపింది. ప్రజలు బయటకు
రావొద్దని ప్రభుత్వం సూచనలు చేసింది. దేవునళ్తాడ, భావనపాడు, మూలపేట మధ్య తుఫాన్ తీరం దాటే చాన్స్ ఉంది. ఆ సమయంలో 70 నుంచి 80 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలు, నిత్యావసర సరుకులను సిద్ధం చేసింది. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని మంత్రి అప్పలరాజు చెప్పారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు  కురవనున్నాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ, ఛత్తీస్ గడ్, ఒడిశా, విదర్భలో భారీ వర్షాలు కురిసే చాన్సుంది.