Cyclone Montha: తెలంగాణపై మొంథా తుపాను ఎఫెక్ట్ పడనుంది. తీరం దాటే సమయం, తీరం దాటిన తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలపై మొంథా తుపాన్ ఎఫెక్ట్ చూపనుంది. నేడు పలు జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ అయింది.
Also Read: Gold: బంగారం, వెండి కొంటున్నారా? అకస్మాత్తుగా ఏం జరిగిందంటే?
నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అత్యంత భారీ వర్షాలు..
నేడు మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ అతి భారీ వర్షాలు..
నేడు కుమ్రం భీమ్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలు
రేపు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
రేపు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్..