Danam Nagender
Danam Nagender : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30వ తేదీన స్పీకర్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని దానం నాగేందర్ కు సూచించారు. అయితే, తాజాగా ఈ విషయంపై దానం నాగేందర్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
Also Read : Inter Students : ఇంటర్‌లో జాయిన్ అయ్యే వారికి గవర్నమెంట్ బంపర్ ఆఫర్.. జాయిన్ అయిన రోజే..
దానం నాగేందర్ భయపడే వ్యక్తి కాదు. పోస్టులకోసం, పదవుల కోసం నేను ఎక్కడికీపోలేదు. నేను ఎఐఎం ఏరియాలో ఆసిఫ్ నగర్ నుంచి పోటీచేసి గెలిచిన వాడిని. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు నాకు సహకరిస్తారు. నా ప్రజలపై ఆధారపడే నా నిర్ణయాలు ఉంటాయని దానం అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే ఆరుసార్లు గెలిచానని గుర్తు చేశారు.
ఖైరతాబాద్ ప్రజలే నాకు బలం. ఎంతవరకు అయితే అంత వరకు ఫైట్ చేస్తాను. స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చా.. మళ్లీ నాకు ఎలాంటి సమాచారం రాలేదు. పిటీషనర్‌కు నోటీసులు అంది ఉండవచ్చు. అఫిడవిట్‌ను మా లాయర్ ఢిల్లీ నుంచి వేశాడు. ఉన్న విషయాలను జస్టిఫై చేసుకోవడానికి లీగల్ అంశాలను పరిశీలిస్తున్నాను. స్పీకర్ ఏం అడుగుతారో దానికి సమాధానం చెప్తాను. స్పీకర్ ప్రశ్నలనుబట్టి నా సమాధానాలు ఉంటాయి. బీఆర్ఎస్ చర్యలను బట్టి నా రియాక్షన్ ఉంటుంది అంటూ దానం నాగేందర్ పేర్కొన్నారు.