Shiva Shankar Master : హైదరాబాదులో ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు

కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి.

Shiva Shankar Master

Shiva Shankar Master : కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి.  మహాప్రస్థానంలో కొద్దిమంది బంధువులు స్నేహితుల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఆట డ్యాన్స్ షో నుంచి శివశంకర్ మాస్టర్‌తో ఎంతో అనుబంధం ఉన్న యాంకర్ ఓంకార్ పాడె మోశారు. ఓంకార్ సోదరుడు అశ్విన్ కూడా పాడె మోశారు.

చదవండి : Shivashankar Master : ఆఖరి కోరిక తీరకుండానే మరణించిన శివశంకర్ మాస్టర్

శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో, చిన్న కుమారుడు అజయ్ తండ్రి చితికి నిప్పంటించారు. అంతకుముందు పంచవటిలోని శివశంకర్ మాస్టర్ నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి పలువురు నివాళులు అర్పించారు. భర్త భౌతికకాయం వద్ద శివశంకర్ మాస్టర్ భార్య విలపించడం అందరినీ కలచివేసింది.

చదవండి : Shiva Shankar : మహాప్రస్థానంలో మాస్టర్ అంత్యక్రియలు..పెద్ద కుమారుడి పరిస్థితి విషమం