Shivashankar Master : ఆఖరి కోరిక తీరకుండానే మరణించిన శివశంకర్ మాస్టర్

డ్యాన్స్ అంటే ప్రాణంగా భావించే ఆయన తన చివరి శ్వాస వరకు కూడా డ్యాన్సర్ గా పని చేయాలని ఆశించారు. తన మరణం కూడా షూటింగ్‌లోనే రావాలని........

Shivashankar Master : ఆఖరి కోరిక తీరకుండానే మరణించిన శివశంకర్ మాస్టర్

Ssm

Shivashankar Master :  ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కరోనాతో నిన్న రాత్రి మరణించారు. ఇటీవల కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ్ తో సహా దాదాపు 10 భాషల్లో 800 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేశారు. ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. స్టార్ హీరోలు, డ్యాన్సర్లు, ఆర్టిస్టులు.. సినీ పరిశ్రమ అంతా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.

Shivashankar Master : వెన్నెముక విరిగి ఎనిమిదేళ్లు మంచం పైనే.. తర్వాత 800 సినిమాలకి కొరియోగ్రఫీ

డ్యాన్స్ అంటే ప్రాణంగా భావించే ఆయన తన చివరి శ్వాస వరకు కూడా డ్యాన్సర్ గా పని చేయాలని ఆశించారు. తన మరణం కూడా షూటింగ్‌లోనే రావాలని, సినిమా సెట్‌లోనే తను కన్నుమూయాలని, ఇదే నా కోరిక అని చాలా సార్లు ఇంటర్వ్యూలలో, తన సన్నిహితులతో కూడా చెప్పారు. ఈ మాట ఒక్కటి చాలు ఆయనకి డ్యాన్స్ అంటే ఎంత ప్రాణమో అర్ధమవుతుంది. దేశ నృత్య పరిశ్రమ ఒక మంచి డ్యాన్సర్ ని కోల్పోయింది. షూటింగ్ లోనే మరణించాలి అనే ఆయన చివరి కోరిక తీరకుండానే కరోనాతో ఇలా హాస్పిటల్ లో మరణించడం బాధాకరం.