CM KCR : ఏపీలో చీకట్లు, సింగిల్ రోడ్లు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

విడిపోతే మనం ఎలా బతుకుతామో ఏమో అని వారంతా బాధపడ్డారు. కరెంట్ ఉండదు, కారు చీకట్లు అలుముకుంటాయని భయపెట్టారు. CM KCR

CM KCR On AP Development

CM KCR On AP Development : తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వరుస పర్యటనలు, సభలు, సమావేశాలతో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెచ్చారు కేసీఆర్.

ఏపీ, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. తెలంగాణలో ఎంత డెవలప్ మెంట్ జరిగింది? ఏపీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అనే దానిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన పొరుగు రాష్ట్రం ఏపీని చూస్తే తెలియట్లేదా మన అభివృద్ధి అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో వెలుగులు, ఏపీలో చీకట్లు.. తెలంగాణ డబుల్ రోడ్లు, ఏపీలో సింగిల్ రోడ్లు.. అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ మారాయి.

Also Read : రూ.70 గడియారం కావాలా..? ఆత్మగౌరవం కావాలా..? : సీఎం కేసీఆర్

సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఏపీతో తెలంగాణను పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ రోడ్ వస్తే తెలంగాణ అని, సింగిల్ రోడ్ వస్తే ఏపీ అని సెటైర్లు వేశారు. ఏపీ రైతులు తమ పంటలను తెలంగాణకు తీసుకొచ్చి అమ్ముతున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదు, కారు చీకట్లు అలుముకుంటాయని బెదిరించారు.. కానీ, ఇప్పుడు ఏపీలోనే చీకట్లు ఉండే పరిస్థితి వచ్చిందన్నారు కేసీఆర్.

ఇక్కడ డబుల్ రోడ్లు, అక్కడ సింగిల్ రోడ్లు..
”తెలంగాణలో మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరితో అయితే విడిపోయామో అదే బోర్డర్ లో మీరున్నారు. వాళ్ల రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో అదే నిదర్శనం. రోజూ పోతారు వస్తారు. నిత్య సంబంధాలు ఉంటాయి. డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఆంధ్ర.

Also Read : బీకేర్ ఫుల్.. అక్కడ 5 నెలలుగా కరెంట్ లేదు.. తెలంగాణ ప్రజలను హెచ్చరించిన కిషన్ రెడ్డి

అక్కడి పంటలు ఇక్కడికి..
మనం ఎలా బతుకుతామో ఏమో అని వారంతా బాధపడ్డారు. విడిపోతే మీరు ఎలా బతుకుతారు? పరిపాలన చేస్తారా? అని అడిగారు. అదే వాళ్లు వచ్చి మన దగ్గర ధాన్యం అమ్ముకుంటున్నారు. మన దగ్గర పేమెంట్ వెంటనే ఇస్తున్నాం. బ్యాంకు ఖాతాల్లో పడుతోంది. ఆంధ్రోళ్లు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది.

ఏపీలో కటిక చీకట్లు..
విడిపోతే తెలంగాణ కటిక చీకటైపోతుంది. కారు చీకట్లు వస్తాయన్నారు. ఇవాళ మన దగ్గర లైట్ల వెలుగు జిలుగులు ఉన్నాయి. వాళ్లే చీకట్లో ఉన్నారు తప్ప మనం లేము” అని కేసీఆర్ అన్నారు.