Pedpadelli District
Pedapalli District: చిన్నప్పుడు తల్లి చందమామను చూపించి ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాటలు పాడుతూ పిల్లలకు అన్నం తినిపిస్తుంది. దానిని తెచ్చి ఇస్తానని మారాం చేస్తున్న పిల్లల్ని ఏమార్చి గోరుముద్దలు తినిపిస్తుంది. చిన్నప్పుడు అమ్మ తెచ్చిస్తానన్న చందమామపై పెద్దయ్యాక పిల్లలు స్థలం కొనిస్తే? ఊహకే అద్భుతంగా ఉంది. నిజంగానే ఓ కూతురు తన తల్లికి చంద్రుడిపై స్థలం కొనిచ్చింది. తన ప్రేమను చాటుకుంది.
Moon Influence Earth Climate : భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న చంద్రుడు
చంద్రుడిపై చాలామంది స్థలాలు కొంటున్నారు. భవిష్యత్‌లో అంతా అక్కడికి వెళ్లి నివాసం ఉంటారా? ఈ ప్రశ్నకు ఎవరూ బదులు చెప్పలేరు. కానీ ఆ స్థలాలు ఎలా కొంటున్నారు? చాలామంది తమకు కావాల్సిన వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలంటే ఏం ఇవ్వాలి? అందరికంటే భిన్నంగా ఏం చేయాలి? అని ఆలోచిస్తారు. అలా ఆలోచించేవారు ఇప్పుడు ఎక్కువగా చంద్రుడిపై భూమిని కొంటున్నారు. తమవారికి బహుమతిగా ఇస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాయి విజ్ఞత అనే మహిళ తన తల్లి వకుళాదేవికి ఆగస్టు 23 అంటే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన వేళ చంద్రుడిపై ఎకరం స్థలం కొని బహుమతిగా ఇచ్చింది. దాని ఖరీదు అక్షరాల రూ.35 లక్షలు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి రాంచంద్ర, వకుళాదేవి దంపతుల కుమార్తె సాయి విజ్ఞత తల్లి వకుళాదేవి పేరు మీద చంద్రుడిపై స్థలానికి 2022 లో దరఖాస్తు చేసారట. ఆగస్టు 23 న ఆవిడ పేరిట రిజిస్టర్ అయ్యింది. రీసెంట్‌గా రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా అందుకున్నారు. సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రేనాల్డ్స్‌కు ప్రాజెక్ట్ మేనేజర్‌గా, ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నారు.
Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి ఇన్ని రకాల మిషన్లా?.. ఇవి అత్యద్భుతం కదా?
చంద్రుడిపై భూమి కొనాలంటే లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయచ్చు. నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. నిజానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం చంద్రుడిపై ఎవరికీ ఎటువంటి హక్కు లేదు.