Davos Tour: జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఫొటో వైరల్

రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమతమ బృందాలతో దావోస్ పర్యటనకు వెళ్లారు.

Chandrababu and Revanth Reddy met politely at Zurich airport

Davos Tour: రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమతమ బృందాలతో దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వీరు పాల్గొంటారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదతరులు ఏపీ నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరగా.. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు సోమవారం జ్యూరిచ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Also Read: అమిత్‌ షాతో ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడలేదు?: అంబటి రాంబాబు

జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో చంద్రబాబు నాయుడు బృందానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం తారసపడింది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పలుకరించుకున్నారు. మంత్రుల బృందంతో ఎయిర్ పోర్టులో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోను టీటీడీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది.

 

ఫొటోలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితోపాటు ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. చంద్రబాబు శ్రీధర్ బాబు భుజంపై చేయివేసి అభినందిస్తుండగా.. రేవంత్ రెడ్డి, నారా లోకేశ్ పక్కపక్కనే నిలబడి ఉన్నారు. అంతకుముందు జ్యూరిచ్ చేరుకున్న చంద్రబాబు, మంత్రుల బృందానికి జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో యూరప్ తెదేపా ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులతో చంద్రబాబు, నారా లోకేశ్ ముచ్చటించారు, అనంతరం వారు చంద్రబాబు, లోకేశ్ తో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.