అమిత్ షాతో ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడలేదు?: అంబటి రాంబాబు
రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ పక్కనపెట్టేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్‌ల గురించి వారు మాట్లాడుతున్నారని అంబటి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇవాళ అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో టీటీడీకి దర్శనానికి వచ్చినపుడు కేంద్ర మంత్రి అమిత్ షాపై రాళ్లతో దాడి చేయించారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని అంబటి రాంబాబు తెలిపారు. ఇప్పటికీ రాష్ట్ర విభజన సమస్యలు అలాగే ఉన్నాయని చెప్పారు. ఇటువంటి సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాటి గురించి మాట్లాడడం లేదని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ పక్కనపెట్టేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్‌ల గురించి వారు మాట్లాడుతున్నారని అంబటి చెప్పారు. కనీసం చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి మాట్లాడలేదని తెలిపారు. అసలు చంద్రబాబుతో అమిత్ షా ఏమేం మాట్లాడారన్న విషయంపై తమకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు.
నారా లోకేశ్ ను ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు నాయుడు అడిగారని అంబటి అన్నారు. అయితే, నారా లోకేశ్ అన్ని శాఖల్లోనూ జోక్యం చేస్తుండడంతో ముందు ఆయనను అదుపులో పెట్టాలని చంద్రబాబుకు అమిత్ షా చెప్పారని వ్యాఖ్యానించారు.
కేంద్ర సహకారంతో వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడ్డాం: సీఎం చంద్రబాబు