CLP Meeting : తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ట్రైడెంట్ హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్ తో పాటు పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ.. సీఎల్పీ మీటింగ్ కు అటెండ్ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశమైంది. పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు అందరినీ ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేలు సైతం ఈ మీటింగ్ కు రావడం ఆసక్తికరంగా మారింది.
పీఏసీ ఛైర్మన్ గా ఉన్న అరికెపూడి గాంధీ సైతం రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని పలు సందర్భాల్లో తేల్చి చెప్పిన అరికెపూడి గాంధీ.. కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశానికి రావడం డిస్కషన్ కు దారితీసింది. నిన్న పీఏసీ సమావేశం సందర్భంగా కూడా తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ఆయన తేల్చి చెప్పారు.
Also Read : రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..
చాలామంది ఎమ్మెల్యేలు ఇదే మాట చెప్పారు. మేము కాంగ్రెస్ లో చేరలేదు, కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశాము, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, దేవుడి కండువా అని చెప్పిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు సడెన్ గా సీఎల్పీ సమావేశానికి హాజరవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో వేడి పెంచింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎల్పీ మీటింగ్ కు రావడంపై కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాకపోయినా.. కుటుంబసభ్యులుగా ఆ ఎమ్మెల్యేలు వచ్చారని, మహేశ్ కుమార్ గౌడ్ కు అభినందనలు తెలపడం కోసమే వారంతా సీఎల్పీ మీటింగ్ వచ్చారని వివరణ ఇచ్చాయి.
పూర్తి వివరాలు..