Mlc Kavitha Ed Investigation
Mlc Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణ కొనసాగుతోంది. ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ లో నాలుగో రోజు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజుకు 6 నుంచి 7 గంటల పాటు సీసీటీవీల పర్యవేక్షణలో కవితను ప్రశ్నిస్తున్నారు అధికారులు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా కేజ్రీవాల్ తో ఒప్పందాలపై విచారణ జరుపుతున్నారు.
లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కవిత ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్ భోజనమే తింటున్నారు. రోజూ కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వైద్యులు. ఇవాళ కవితను తల్లి శోభ, పిల్లలు, కుటుంబసభ్యులు కలిసే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ(మార్చి 20) నాలుగో రోజు కస్టడీ. 23వ తేదీవరకు కూడా కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రోజుకు 6 నుంచి 7 గంటల సమయం పాటు కవితను వివిధ అంశాలపైన ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం.
Also Read : కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. ఆ అభ్యర్థనకు ఆమోదం
100 కోట్ల ముడుపులు సహా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన సమావేశాలు, అందులో కవిత పాల్గొన్నారా? మనీశ్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తో సంబంధాలు, అలాగే 100 కోట్ల ముడుపులను ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ ద్వారా తరలించారు? ఇటువంటి అనేక అంశాలతో పాటు ఇప్పటికే ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కూడా కవితను ప్రశ్నిస్తున్నారు.
సీసీటీవీ పర్యవేక్షణలో మొత్తం క్వశ్చనింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (3 గంటల పాటు), అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు (మరో మూడు గంటల పాటు) ఆ తర్వాత సాయంత్రం పూట కూడా కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేశారు. 10 రోజుల కస్టడీ కోరగా వారం రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి అనుమతి ఇచ్చారు.
Also Read : ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు.. సీఎం రేవంత్‌పై సీనియర్లు సీరియస్