Delhi Liquor Scam..MLC Kavitha : విచారణకు రేపు రాలేను..15 తరువాతే వస్తా.. అంటూ ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులిచ్చింది. దీంతో కవిత 9న విచారణకు రాలేనని 15 తరువాతే విచారణకు వస్తాను అంటూ లేఖ రాశారు.

Delhi Liquor scam..MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తాను ఎమ్మెల్సీ కవిత బినామీనని..ఆయన ఆదేశాల మేరకే తాను ఆర్థిక లావాదేవీలు జరిపాను అంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై తమ విచారణలో తెలిపాడని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్సీ కవిత మార్చి (2023)9న విచారణకు హాజరవ్వాలని ఆదేశిస్తూ ఈడీ నోటీసులు జారీ చేసింది.

Delhi liquor scam : ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీ .. ఈడీ విచారణలో స్టేట్‌మెంట్ ఇచ్చిన పిళ్లై

దీంతో కవిత తాను 9వ తేదీన విచారణకు రాలేనని 15 తరువాతే విచారణకు వస్తాను అంటూ ఈడీకి లేఖ రాశారు. మార్చి 10న ఢిల్లీలో మహిళల రిజర్వేషన్లకు సంబంధించి నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నామని ఇది ముందుగానే నిర్ణయించిన కార్యక్రమం అని అందుకే 15 తరువాతే తాను విచారణకు హాజరు అవుతాను అని లేఖలో పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని అంతేతప్ప..ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం సాధ్యం కాదని కవిత అన్నారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. 9న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

కాగా..ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర, ముడుపుల అంశం వంటి అంశాలపై కవితను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన చార్జిషీటులో రామచంద్ర పిళ్లై పాత్రని ఈడీ ప్రస్తావించింది. పిళ్లైపై అనేక అభియోగాలు నమోదు చేసింది. కవిత తరఫున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీటులో కూడా కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో గురువారం జరగబోయే విచారణ కీలకం కానుంది.


ట్రెండింగ్ వార్తలు