Delhi liquor scam : ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీ .. ఈడీ విచారణలో స్టేట్‌మెంట్ ఇచ్చిన పిళ్లై

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ అని..ఆమె ఆదేశాల మేదరకు పిళ్లై పనిచేశాడు అని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు రెండు రోజులపాటు ప్రశ్నించగా తాను ఎమ్మెల్సీ కవిత ప్రతినిథిని అని పిళ్లై స్టేట్ మెంట్ ఇచ్చాడని ఈడీ తెలిపింది.

Delhi liquor scam : ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీ .. ఈడీ విచారణలో స్టేట్‌మెంట్ ఇచ్చిన పిళ్లై

Delhi Liquor Scam MLC Kavitha

Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై (arun ramachandra pillai)బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు బినామీ అని..ఆమె ఆదేశాల మేదరకు పిళ్లై పనిచేశాడు అని ఈడీ (ED) స్పష్టంచేసింది. ఇటీవల అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు రెండు రోజులపాటు ప్రశ్నించగా తాను ఎమ్మెల్సీ కవిత ప్రతినిథిని అని పిళ్లై స్టేట్ మెంట్ ఇచ్చాడని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ తో ఉన్న భాగస్వామ్యంలో పిళ్లైది కీలక పాత్రధారి అని ఈడీ వెల్లడించింది.రూ.3.50 కోట్ల పెట్టుబడి పెట్టామని పిళ్లై తమ విచారణలో వెల్లడించాడని..ఫలితంగా ఎమ్మెల్సీ కవిత ఆదేశాలతోనే పిళ్లైకు కోటిరూపాయాలు ఇచ్చారని ఈడీ అధికారులు తెలిపారు. ఇలా పలు విధాలుగా జరిగిన నగదు లావాదేవాలపై పిళ్లైను ఇంకా విచారించాల్సి ఉందని విచారణలో ఇంకా కీలక విషయాలు తెలుస్తాయని అన్నారు. ఈడీ తెలిపిన వివరాలల్లో అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టులో మరోసారి సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించింది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారని బీజేపీ (BJ)\P) నేతలు చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమేకాదని నిజమనేలా ఈడీ (ED) అధికారులు అరుణ్ పిళ్లై (arun ramachandra pillai) విచారణలో స్పష్టంచేశారు. స్వయంగా అరుణ్ పిళ్లై తాను కవిత బినామీని అని స్టేట్ మెంట్ ఇచ్చాడని ఈడీ అధికారులు స్పష్టంచేశారు. కవిత ఆదేశాల మేరకే పిళ్లై పనిచేశాడని తేల్చారు ఈడీ (ED) అధికారులు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్టు

కాగా దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఘటనలో అరెస్టులపర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 11 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే పిళ్లైను రెండుసార్లు ఈడీ ప్రశ్నించింది. ఈక్రమంలో పిళ్లైను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సౌత్ గ్రూప్ వ్యవహారాలు నడిపిన కీలక వ్యక్తిగా అరుణ్ రామచంద్ర పిళ్లై ఉన్నారు.

అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యాపారవేత్త, లిక్కర్ వ్యాపారాలను నిర్వహిస్తున్నాడు. ఢిల్లీలోని ఇండో స్పిరిట్ కంపెనీలో వాటా దారుడుగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందిన వారిలో అరుణ్ రామచంద్ర పిళ్లై ఒకరని చెప్పవచ్చు. అతన్ని రెండు రోజులపాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత (సోమవారం) రాత్రి 11 గంటల సమయంలో ఈడీ అధికారుల అదుపులోకి తీసుకున్నారు.