Telangana Assembly Session 2024 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్.. ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రానున్న కేసీఆర్

సంక్షేమం - అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

Telangana Assembly

Telangana Assembly Budget : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్ ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ఇదే. సుమారు 3లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని అంచనా.

Also Read : సీఎం రేవంత్ వర్సెస్ హరీశ్ రావు.. అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాడీవేడి చర్చ

సంక్షేమం – అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి భారీగా నిధులను రేవంత్ సర్కార్ కేటాయించే అవకాశం ఉంది. ఇదిలాఉంటే బడ్జెట్ కు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 9గంటలకు మంత్రివర్గం భేటీ జరిగింది. ఈ భేటీలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గవర్నర్ నుంచి ఆమోదం తెలిపిన తరువాత మధ్యాహ్నం 12గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Also Read : CM Revanth Reddy : బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ నిప్పులు

కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోపాటు ఏడు కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉంది. ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగించాలి, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వానికి ఇది పెద్ద టాస్క్ గానే భావించాల్సి ఉంటుంది. అందుకే, వాస్తవాలకు అనుగుణంగా, హంగూఆర్భాటాలకు పోకుండా బడ్జెట్ రూపకల్పన ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటుండటంతో.. బడ్జెట్ రూపకల్పన ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ 2.90లక్షల కోట్లకు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మూడు నెలలకు మాత్రమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి.. దీంట్లో దేన్ని ప్రాధాన్యతగా తీసుకోబోతున్నారు. ఏ పథకానికి నిధులు కేటాయించబోతున్నారనేది ఆసక్తినెలకొంది. ప్రస్తుతం ఉన్న సంక్షేమాన్ని కొనసాగిస్తూనే తాము ఇచ్చిన హామీలను అమలుకు బడ్జెట్ పెద్దపీట వేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గోనున్నారు. ఇదిలాఉంటే