సీఎం రేవంత్ వర్సెస్ హరీశ్ రావు.. అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాడీవేడి చర్చ

ప్రాజెక్టుల విషయంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.

సీఎం రేవంత్ వర్సెస్ హరీశ్ రావు.. అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాడీవేడి చర్చ

Harish Rao Strong Counter To CM Revanth Reddy

Harish Rao : తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాడీవేడి చర్చ జరిగింది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు వర్సెస్ మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. కృష్ణ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేదిలేదని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

కేంద్ర జలశక్తి విడుదల చేసిన మినిట్స్ లో బోర్డుకు ప్రాజెక్టులను ఇస్తున్నట్లు ఒప్పుకున్నారని మాజీమంత్రి హరీశ్ చెప్పారు. కృష్ణా బోర్డుకు సీడ్ మనీ కింద 200కోట్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ కేటాయింపులు చేసింది అప్పటి ఆర్థికమంత్రి హరీశ్ రావే అని.. అన్ని పాపాలకు కారణం హరీశ్ రావు అని సీఎం రేవంత్ అన్నారు. మినిట్స్ తప్పు అని కేంద్రానికి ఇరిగేషన్ సెక్రటరీ లేఖ రాశారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

Also Read : రోజా రొయ్యల పులుసు పెట్టారు, జగన్ బొక్క పెట్టారు- బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ నిప్పులు

మంత్రి ఉత్తమ్ కామెంట్స్
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పే ప్రసక్తే లేదు
తెలంగాణకు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే
కేసీఆర్, జగన్ ఏకాంతంగా చర్చలు జరిపారు
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడానికి మేము ఒప్పుకోలేదు
2023-24లో బడ్జెట్ లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో నిధులు కేటాయించారు

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..
ఏ పాపం తీసుకున్నా బీఆర్ఎస్ నేతలే కనిపిస్తున్నారు
12న కేసీఆర్ అసెంబ్లీకి రావాలి
13న ఎమ్మెల్యేలంతా కాళేశ్వరం పర్యటనకు వెళ్లేలా సభ్యులకు ఆదేశాలు ఇవ్వండి

హరీశ్ రావు కామెంట్స్..
మా పార్టీ శాసనసభ్యులపై మాకు నమ్మకం ఉంది
కాంగ్రెస్ పార్టీకే వారి ఎమ్మెల్యేలపై నమ్మకం లేదు
కృష్ణ జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది
ఎస్ఎల్ బీసీ టన్నెల తవ్వకాలపై సీఎం రేవంత్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి
కేఆర్ఎంబీని అప్పజెప్పింది మీరు కాదా?
రెండు మినిట్లలో రెండు మీటింగ్ లు జరిగాయి
17వ తేదీన ఒక మీటింగ్, 1వ తేదీన రెండో మీటింగ్ జరిగింది
ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ మీటింగ్ లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకుని వచ్చారు

Also Read : ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!