రోజా రొయ్యల పులుసు పెట్టారు, జగన్ బొక్క పెట్టారు- బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ నిప్పులు
మన భూభాగంలో ఉన్న నాగార్జున్ సాగర్ లోకి తుపాకులతో వచ్చి జగన్ ఆక్రమించుకుంటే.. చేతకాక ఇక్కడి ప్రభుత్వం చూసింది..

CM Revanth Reddy : బీఆర్ఎస్ టార్గెట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. పలు అంశాల్లో ఆ పార్టీ నేతలను చెడుగుడు ఆడేసుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంలో బీఆర్ఎస్‌ను అసెంబ్లీలో షేక్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
”రాష్ట్ర పునర్విభజన బిల్లు నా సూచన మేరకే వచ్చిందని కేసీఆర్ పదే పదే చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? నరేంద్ర మోదీ నల్లగొండలో ఉంటారా? ఢిల్లీలో ఉంటారా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. దమ్ముంటే ఢిల్లీలో చూస్కోండి. గల్లీలో కాదు. జంతర్ మంతర్ లో ధర్నా చేయండి. మేము కాపాలా ఉంటాం.
నాగార్జునసాగర్ మీదకి జగన్ తుపాకులతో వస్తే.. చేత కాక కూర్చున్నారు. రాయలసీమకు పోయినప్పుడు మంత్రి రోజా ఇంటికి వెళ్లి ఆమె పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు కేసీఆర్. రాయలసీమ ఎత్తిపోతల పథకం.. జీవో 203 రూపొందించుకుంది ప్రగతి భవన్ లోనే. ఏపీ.. ఒక్కరోజు 12.5 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తరలించుకుపోయేలా ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళు మూసుకున్నారు.
తెలంగాణకు ఎస్ ఎల్ బీసీని.. తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలమూరు-రంగారెడ్డి పదేళ్లలో పూర్తి చేయలేదు. పదేళ్లలో కృష్ణా నీళ్లలో మరణశాసనం రాశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతుంటే మా కాళ్ళకు అడ్డం పడుతున్నారు. కృష్ణా జలాల నీళ్లు అప్పగించింది కేసీఆర్ కాదా? 68శాతం క్యాచ్ మెంట్ ఏరియా ఉంటే.. 33శాతం నీటి వాటా 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. సంతకాలు చేయడం వల్ల.. కృష్ణాలో తెలంగాణకు మరణశాసనం రాశారు. 2014లో కొత్తలో చేశారేమో అనుకున్నాం. కానీ 2016తో పాటు 2023 వరకు సేమ్ సంతకాలు చేశారు. దీనికి హరీశ్ రావు ఏం సమాధానం చెబుతారు? జగన్ ఆక్రమించుకుంటే ఏం చేశారు?” అని నిలదీశారు రేవంత్ రెడ్డి.
”మీ కళ్ల ముందే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టింది. మీ కళ్ల ముందే కదా రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడును 44వేల క్యూసెక్కులకు పెంచి తరలించుకుపోయింది. మీ కళ్ల ముందే కదా మీ ఇంట్లో పంచభక్షపరమాన్నాలు జగన్ కు పెట్టి జీవో నెంబర్ 203 ను మీ ఇంట్లోనే పునాదులు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతిభవన్ లో కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద పునాది రాయి పడింది. దానికి పునాది రాయి వేసింది మీరే కదా? రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పెలించింది, కాంట్రాక్టులు అప్పగించింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా?
Also Read: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో పిటిషన్.. రేవంత్‌కు నోటీసులు
రాయలసీమ లిఫ్ట్.. 797 ఎఫ్ఆర్ఎం దగ్గర కట్టారు. కుండకు సైడ్ లో కాదు కింద బొక్క పెట్టారు. పిలిచి పంచభక్షపరమాన్నాలు వీళ్లు పెట్టారు.. జగన్ మోహన్ రెడ్డి వీళ్ల కింద బొక్క పెట్టారు. బొక్క పెట్టి మొత్తం తరలించుకుపోతుంటే మిన్నకుండా ఉన్నారు. మన భూభాగంలో ఉన్న నాగార్జున్ సాగర్ లోకి తుపాకులతో వచ్చి జగన్ ఆక్రమించుకుంటే.. చేతకాక ఇక్కడి ప్రభుత్వం చూసింది. వీళ్ల సహకారం లేకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలా వస్తారా? ఇంటి దొంగలు లేకుండా జగన్ వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారా కాసే పరిస్థితి వస్తుందా? వాళ్లు పెట్టిన పులుసు తిని వీళ్లు అలుసు ఇవ్వడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది” అంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.