నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్ విడుదల, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల వాయిదాలు ఉండేవన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

Telangana Job Calendar : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. జాబ్ క్యాలెండర్ గురించి ముందే ప్రకటించామని, ఇప్పుడు అమలు కూడా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల వాయిదాలు ఉండేవన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

కాగా, జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అక్టోబర్ లో ట్రాన్స్ కో, డిస్కంల ఇంజినీరింగ్, ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఇది కేవలం ప్రకటన మాత్రమే అని, దీనిపై అసెంబ్లీలో చర్చ ఉండదని డిప్యూటీ సీఎం భట్టి తేల్చి చెప్పారు.

జాబ్ కాలెండర్… పూర్తి వివరాల కోసం ఇక్కడ Job Calendar క్లిక్ చేయండి…

 

జాబ్ క్యాలెండర్ పై సభలో చర్చకు అవకాశం ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. జాబ్ కేలండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు