Vemulawada (1)
Devi Navaratri celebrations : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో రేపటి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. మొదటిరోజు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి గురువారము.. శైలపుత్రి అలంకారముతో హంస వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు.
రెండవరోజు ఆశ్వీయుజ శుద్ధ విదియ శుక్రవారము… ‘బ్రహ్మచారిణి అలంకారముతో నెమలి వాహనంపై దర్శనం ఇస్తారు. మూడవ రోజు ఆశ్వీయుజ శుద్ధ తదియ శనివారము చంద్రఘంట అలంకారముతో దర్శనం ఇవ్వనున్నారు. నాల్గవ రోజు ఆశ్వీయుజ శుద్ధ చవితి ఆదివారము.. కూష్మాండ అలంకారముతో దర్శనం ఇస్తారు.
Thirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ఐదవ రోజు ఆశ్వీయుజ శుద్ధ పంచమి ఉపరి షష్టి సోమవారము…స్కందమాత అలంకారముతో దర్శనం ఇవ్వనున్నారు. ఆరవ రోజు ఆశ్వీయుజ శుద్ధ సప్తమి మంగళవారము.. కాత్యాయని అలంకారముతో భక్తులకు దర్శనం ఇస్తారు. ఏడవ రోజు ఆశ్వీయుజ శుద్ధ అష్టమి బుదవారము (దుర్గాష్టమి).. కాళరాత్రి అలంకారముతో నెమలి వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు.
ఎనిమిదవ రోజు’ (మహర్నవమి) గురువారము..మహాగౌరీ అలంకారముతో ధర్మగుండము నందు తెప్పోత్సవముపై భక్తులకు దర్శనం ఇస్తారు. తొమ్మిదవ రోజు శుక్రవారము.. (విజయదశమి) దసరా సిద్ధిదా (శ్రీ మహాలక్ష్మీ) శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారము గజవాహనములపై అంబారీ సేవతో దర్శనం ఇవ్వనున్నారు.