వారు అందరూ బీజేపీలోకి వస్తున్నారు.. చివరికి రేవంత్ రెడ్డి కూడా వస్తారు: ఎంపీ అర్వింద్

Dharmapuri Arvind: రేవంత్ రెడ్డికి లోపల హిందుత్వం ఉన్నప్పటికీ ఏమీ చేయలేక పోతున్నారని..

కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు అందరూ వెళ్లిపోతున్నారని, బీజేపీలోకి వస్తున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లాలో మాట్లాడుతూ.. చివరికి తమ పార్టీలోకి రేవంత్ రెడ్డి కూడా వస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డికి లోపల హిందుత్వం ఉన్నప్పటికీ ఏమీ చేయలేక పోతున్నారని అన్నారు.

కాంగ్రెస్ నేతలకు ఎజెండా అంటూ ఏదీ లేదని తెలిపారు. ప్రజలకు ఏం చేస్తారో వారు చెప్పట్లేదని అర్వింద్ అన్నారు. ఓట్లు మాత్రం అడుగుతున్నారని తెలిపారు. సీబీఐని రాష్ట్రంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజన చేసిందని అర్వింద్ విమర్శించారు. 370 తీసేస్తామని, త్రిపుల్ తలాక్ తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని తెలిపారు. దేశంలో ఒకే చట్టం ఉండాలని, దాన్ని ఎందుకు అమలు చేయలేదని అన్నారు.

రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని ఎందుకు పెట్టారని అర్వింద్ ప్రశ్నించారు. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందని నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని అన్నారు. మహిళలకు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని చెప్పారు. తాను అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని అన్నారు.

Also Read: 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్ చెప్పిన 24 గంటల్లోపే ఇలా జరిగింది: బీజేపీ నేత లక్ష్మణ్

ట్రెండింగ్ వార్తలు