25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్ చెప్పిన 24 గంటల్లోపే ఇలా జరిగింది: బీజేపీ నేత లక్ష్మణ్

కేసీఆర్ బస్సు యాత్ర కాకుండా మోకాళ్ల యాత్ర చేసినప్పటికీ ప్రజలు ఆయనను నమ్మరని చెప్పారు.

25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్ చెప్పిన 24 గంటల్లోపే ఇలా జరిగింది: బీజేపీ నేత లక్ష్మణ్

BJP Laxman

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్ చెబుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఆ మాట చెప్పిన 24 గంటలలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ టచ్‌లోకి వచ్చారని చెప్పారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకే సీఎం రేవంత్ రెడ్డి అభద్రత భావంతో ఉన్నారని అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర కాకుండా మోకాళ్ల యాత్ర చేసినప్పటికీ ప్రజలు ఆయనను నమ్మరని చెప్పారు. దేశంలో ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ విఫలం అయిందని, ఆ పార్టీ తుడుచుకుపెట్టుకు పోయిందని తెలిపారు.

అలాగే, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కనుమరుగు అవుతుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైనా బీజేపీని ఎదుర్కోలేవని చెప్పారు. పెద్దపల్లి అభ్యర్థి విషయంలో ఇప్పటివరకు మార్పు ఆలోచన లేదని తెలిపారు. దేశంలో నిన్న జరిగిన లోక్‌సభ తొలి విడత పోలింగ్ లో బీజేపీ 50 శాతం పైగా సీట్లు సాధిస్తుందని అన్నారు.

తమిళనాడులోనూ 10 నుంచి 12 స్థానాల మధ్య ఎన్డీయే గెలుస్తుందని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలోనూ తమ పార్టీ దూసుకపోతుందని చెప్పారు. రాష్ట్రంలో 12 స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలి..? : వెల్లంపల్లి శ్రీనివాస్