బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలి..? : వెల్లంపల్లి శ్రీనివాస్

బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్ కు ఎవరు వచ్చిన దిక్కులేదంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నిన్నరాత్రి బోండా ఉమ నాటక ప్రభంజనం సృష్టించాడు. నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి

బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలి..? : వెల్లంపల్లి శ్రీనివాస్

Vellampalli Srinivas-Bonda Uma

MLA Vellampalli Srinivas : మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయ ప్రభంజనం ఖాయమని ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ దీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రామకృష్ణపురం 30వ డివిజన్ లో ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పునూరు గౌతమ్ రెడ్డి, కార్పొరేటర్ జానా రెడ్డి, తోట శ్రీనివాస్ లతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ పై రాయిదాడి ఘటనలో బోండా ఉమాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమాకు ఓటమి భయం పట్టుకుంది.. ఆయన తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడు. దొంగచాటుగా ఎందుకు నామినేషన్ వేశారో బోండా ఉమా చెప్పాలంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.

Also Read : Srikalahasti Race Gurralu : టీడీపీ వర్సెస్ వైసీపీ.. ముక్కంటి ఇలాకాలో హోరాహోరీ

బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్ కు ఎవరు వచ్చిన దిక్కులేదంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నిన్నరాత్రి బోండా ఉమ నాటక ప్రభంజనం సృష్టించాడు. నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. బోండా ఉమని అరెస్టు చేస్తారని.. అతనికి అతనే మెసేజ్ లు ఫార్వర్డ్ చేశాడు. బోండా ఉమ ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తుంది. సీఎం జగన్ పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడంటూ వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : ఇదేనా నీ సంస్కారం..! సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీకే అరుణ ఆగ్రహం

బోండా ఉమ వెనకాల ప్రజలు లేరు. పోటీకూడా నిలబడలేని అసమర్ధుడు అతను. సీఎం జగన్ పై బోండా ఉమ అనుచరులు దాడిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిపైనే ఉమ హత్యా ప్రయత్నం చేయిస్తాడా? వేముల దుర్గారావు నా సొంత మనిషి అని ఉమానే చెప్పుకున్నారు. సీఎం జగన్ పై రాయి వేశానని ఆయన ఒప్పుకున్నట్లే. ఇంతకన్నా ఆధారాలు ఏమి కావాలి. ఈ ఎన్నికల్లో బోండా ఉమకు డిపాజిట్లు కూడా రావు.. నేను ఛాలెంజ్ చేస్తున్నా. 22న ఉదయం సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా నామినేషన్ ఉంటుందని వెల్లంపల్లి అన్నారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ దగ్గర నుంచి నగరపాలక సంస్థ నుంచి ర్యాలీ ఉంటుంది. ప్రతిఒక్కరూ పాల్గొని నామినేషన్ ర్యాలీని విజయవంతం చేయాలని వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.